తమిళనాడులో రోడ్డెక్కనున్న బస్సులు : లాక్డౌన్ ఆంక్షలు సడలింపు

ఆదివారం, 20 జూన్ 2021 (14:05 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇచ్చారు. అదేసమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్‌ను ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడగించింది. పనిలోపనిగా పలు సడలింపులు ఇచ్చింది. 
 
చెన్నై చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లోని ( చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు) జిల్లాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నాన్‌ ఏసీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే మెట్రో రైలు సేవలు సైతం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయని తెలిపింది.
 
ఈ-రిజిస్ట్రేషన్‌తో ఆటోరిక్షాలు, అద్దె క్యాబ్‌లలో ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. గరిష్టంగా 100 మందితో సినిమా, టీవీ షూటింగ్‌లకు అవకాశం కల్పించింది. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి.. మధ్య ప్రాంతంలోని 11 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. 
 
23 ఇతర జిల్లాల్లో పలు దుకాణాలు, ఆఫీసులు తదితర కార్యకలాపాల నిర్వహణకు నిర్ధిష్ట సమయాన్ని పొడగించింది. అత్యవసర ప్రభుత్వ సేవల కార్యాలయాల్లో 100 శాతం ఉద్యోగులతో పని చేసేందుకు అనుమతిచ్చింది. అలాగే, వ్యాపార కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పొడగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు