రాజకీయాల్లోకి రజనీకాంత్..? వీరప్పన్‌తో భేటీ.. ఎందుకబ్బా?

శనివారం, 8 ఏప్రియల్ 2017 (09:22 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో మరోసారి ఊపందుకుంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎమ్. వీరప్పన్‌‌తో రజనీకాంత్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 2వ తేదిన అభిమానులతో రజనీకాంత్ ఏర్పాటు చేసిన సమావేశం కూడా రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై చేసిందనే ప్రచారం కూడా సాగింది. 
 
అయితే తాను రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ ప్రకటించారు. ఈ విషయమై తమిళనాడు రాజకీయాల్లో హట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం నాడు ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎం వీరప్పన్‌తో సుమారు గంటకుపైగా సమావేశమయ్యారు. 
 
ఇకపోతే.. రజనీకాంత్ హీరోగా ఆర్ఎం వీరప్పన్ అనేక హిట్ సినిమాలను నిర్మించారు. అయితే 1995లో భాషా చిత్ర విజయోత్సవ వేదికపై రజనీకాంత్ అన్నాడీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో రజనీకాంత్ కారణంగా మంత్రి పదవి కోల్పోయారు. 
 
బాషా సినిమా ఫంక్షన్ వేదికపై నుండి అన్నాడీఎంకె ప్రభుత్వాన్ని రజనీకాంత్ చేసిన ఆరోపణలు ఆనాడు తమిళనాడులో సంచలనంగా మారాయి. జయలలిత మంత్రివర్గంలో ఉన్న వీరప్పన్‌పై వేటుపడింది. జయలలిత వీరప్పన్‌ను తన మంత్రివర్గం నుండి తొలగించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు అభిమానులతో రజనీకాంత్ వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిని కల్గిస్తోంది.

వెబ్దునియా పై చదవండి