టీడీపీ ఎంపీలు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు.. స్పీకర్ వార్నింగ్

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (12:42 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానిస్తూ, వారిని సున్నితంగా హెచ్చరించారు. అంతేకాకుండా, చెప్పినమాట వినకుంటే, మీ పిల్లల్ని కూడా అదుపులో పెట్టుకోలేరంటూ మందలించారు. 
 
విభజన హామీలను అమలు చేయాలంటూ గత రెండు రోజులుగా టీడీపీ సభ్యులు పార్లమెంటు బయట, లోపల ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా బుధవారం కూడా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ కోపగించుకున్నారు.
 
తెలుగుదేశం పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారని చురకలు వేశారు. అంతేగాక ఇలా అయితే ఇంట్లో పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టుకోలేరంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు