రైలు పట్టాలపై ఫ్లైట్.. తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో సర్వీసులు... ప్రత్యేకతలేంటో తెలుసా?
సోమవారం, 22 మే 2017 (12:01 IST)
భారతీయ రైల్వే వ్యవస్థలో అత్యంత విలాసవంతమైన రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్. సోమవారం పట్టాలపైకి రానంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్‌లో ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ క్రమంలో తేజస్ రైలులో ఉన్న సదుపాయాలేంటో, ఈ రైలు విశేషాలపై ఓ లుక్కేద్దాం.
1. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన రైలు. ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్స్, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఎన్నో సౌకర్యాలు.
2. గంటకు 130 నుంచి 200 కిమీ వేగంతో పరుగు పెడుతుంది.
3. తొలి ట్రైన్ ముంబై - గోవాల మధ్య ప్రారంభం. దశల వారీగా ఢిల్లీ- చండీగఢ్, ఢిల్లీ-లక్నో మార్గాల్లో నడుపుతారు.
4. కోరిన ఆహారాన్ని సరఫరా చేస్తారు.
5. తేజస్ రైలు కోచ్‌లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ కోచ్‌లు పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారు చేశారు. ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు. అదేవిధంగా దుమ్ము, ధూళి కూడా అంటుకోదు.
6. సీట్లను అత్యంత అధునాతన డిజైన్‌తో తయారు చేయగా, రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులు ఉండవు.
7. సీజన్‌లో ఐదు రోజులు.. అన్‌సీజన్‌లో 3 రోజుల పాటు నడుపుతారు.
8. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉన్న 20 కోచ్‌లు ఈ ట్రెయిన్‌లో ఉన్నాయి. చెయిర్ కార్ ఉన్న కోచ్‌లు 12 ఉన్నాయి. మొత్తం 32 బోగీలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఒక్కో బోగీకి 56 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అదే చెయిర్ కార్‌లో అయితే 78 మంది వరకు ప్రయాణించవచ్చు.
9. అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్ టెక్నాలజీ. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేందుకు అవకాశం. ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను.
10. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో సమాచారం.
11. విమానంలో ఉండే సౌకర్యాలు ఇందులో ఉంటాయి. టిక్కెట్ల ధరలు కూడా ఇంచుమించుకా ఫ్లైట్ టిక్కెట్‌తో సమానం.