సాధారణంగా చాలా మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి వారి వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా అనేక మంది మృత్యువాతపడుతున్నారు. మరికొందరు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌కు చెందిన ముగ్గురు అధికారులు సరికొత్త ఆల్కాహాలిక్ సెన్సార్ యంత్రాన్ని గుర్తించారు.
కోల్ ఇండియాలో బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు.. తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలను చూసిన ఇందులో పని చేసే అజిత్ యాదవ్, సిద్దార్థ్ సుమన్, మనీష్ బాల్‌ముచ్చు అనే ముగ్గురు ఇంజనీర్లకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన స్నేహితులైన మనీశ్, సిద్ధార్థ్‌లతో కలిసి కార్యాచరణ ప్రారంభించారు. వాహనాల్లో మద్యాన్ని పసిగట్టే భద్రతా వ్యవస్థను రూపొందించారు.