రజనీకాంత్‌తో భేటీ అందుకే.. కావేరి జలాల పరిష్కారానికి ''అమ్మ'' కృషి చేయాలి

శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:36 IST)
సీనియర్ నేత తిరునావుక్కరసర్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ రాజకీయాల్లో సంచవలనం రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైనన తిరునావుక్కరసర్‌ను రజనీకాంత్ కలవడంతో.. ఆయన రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తన చిరకాల మిత్రుడిని కలిసేందుకు వెళ్ళానని తిరునావుక్కరసర్ ప్రకటించడంతో.. అరెరె ఇంతేనా అంటూ.. అందరూ కామ్ అయిపోయారు. 
 
రజనీ కాంత్‌తో తనకు 40 ఏళ్ల స్నేహబంధం ఉందని తిరునావుక్కరసర్ తెలిపారు. కబాలి చిత్రం విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలియజేడానికే భేటీ అయ్యాను తప్ప, మరెలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావనే రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
ఇకపోతే.. టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తిరునావుక్కరసర్‌ పలువురు రాజకీయ పార్టీల నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. అదేవిధంగా గురువారం ఉదయం ఎంజీఆర్‌ కళగం నేత ఆర్‌బీ వీరప్పన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కూడా తిరునావుక్కరసర్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. గంటపాటు జరిగిన ఈ భేటీకి అనంతరం సత్యమూర్తిభవన్‌కు వచ్చిన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం నాలుగు వారాల్లో కావేరి నదీజలాల సమస్యపై కమిటీని ఏర్పాటు చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చట్టప్రకారం చర్యలు చేపట్టి కావేరి నదీ జలాల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఈ వ్యవహారంలో అందరూ ఐకమత్యంగా వుండాలని, మనమంతా దేశ పౌరులమని గుర్తించుకోవాలన్నారు.

వెబ్దునియా పై చదవండి