జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి

శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:55 IST)
జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. సుహైల్‌ నిసార్‌ లోన్‌, యాసిర్‌ వాని, జునైద్‌ అహ్మద్‌లుగా గుర్తించారు.

ఈ ముగ్గురు ఇటీవల ఉగ్రవాదంలో చేరారని ఐజిపి విజరు కుమార్‌ తెలిపారు. బిజెపి నేత అన్వర్‌ ఖాన్‌ ఇంటిపై దాడి చేసిన ఉగ్రవాదుల్లో...మృతుల్లోని ఇద్దరు పాల్గన్నారని, ఈ ఘటనలో జమ్ముకాశ్మీర్‌లో కానిస్టేబుల్‌ మృతి చెందారని చెప్పారు.

ఈ దాడిలో పాల్గన్న వారిలో ఇద్దరు ఉగ్రవాదులు లష్కరో తోయిబా, మరో ఇద్దరు అల్‌బదర్‌కు సంబంధించిన ఉగ్రవాదులని తెలిపారు. ఈ దాడిలో పాల్గన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు కోసం అన్వేషణ కొనసాగుతుందని అన్నారు. వీరు పుల్వామా, శ్రీనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు