టిక్ టాక్ పరిచయం.. డబ్బు కోసం మహిళను చంపేశాడు.. ఎక్కడ?

శనివారం, 7 మార్చి 2020 (12:04 IST)
టిక్ టాక్ కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. టిక్ టాక్‌లో సరదాగా మొదలైన పరిచయాలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో దారుణం జరిగింది. టిక్ టాక్ కారణంగా పరాయి వ్యక్తితో పరిచయం చివరికి మహిళ ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. నోయిడాలో నివాసం ఉంటే ఓ మహిళ తన అపార్టుమెంటులో హత్యకు గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
మృతురాలు బిసారక్‌లో నివాసం ఉంటుంది. మార్చి ఐదో తేదీన రాత్రి ఆమె కొడుకు ఇంటికి వచ్చాడు. డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉంది. ఎన్నిసార్లు బెల్ కొట్టినా డోర్ తియ్యలేదు. ఎలాగో లోపలికి ప్రవేశించిన అతడు.. తల్లి మృతదేహం చూసి షాక్ అయ్యాడు. ఆమె ముఖం మీద గాయాలు ఉన్నాయి. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి పేరు రాఘవ కుమార్ అని ఢిల్లీ వాసి అని తేలింది. టిక్ టాక్ ద్వారా మృతురాలికి పరిచయమయ్యాడు. టిక్ టాక్‌లో ఇద్దరూ యాక్టివ్‌గా ఉండేవారు. వీడియోలు షేర్ చేసుకునే వారు. క్రమంగా స్నేహం బలపడింది. ఇద్దరూ దగ్గరయ్యారు. రాఘవ మహిళ ఇంటికి తరుచుగా వచ్చి వెళ్లేవాడు. ఇలా ఓ సారి డబ్బు కోసం ఈ క్రమంలో జరిగిన గొడవ హత్యకు కారణమైంది. 
 
హత్య చేసింది తానే అని, డబ్బు కోసమే చంపేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోషల్ మీడియాలో పరాయి వ్యక్తులతో పరిచయాలు మంచివి కాదని పోలీసులు హితవు పలుకుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు