జమ్మూ కాశ్మీర్ విభజనను టీఎంసీ సభ్యుడు బందోపాధ్యాయ తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో ఉంటే ఈ బిల్లును సమ్మతించడమో, వ్యతిరేకించడమో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు తనకు ఇష్టం లేదని బంధోపాద్యాయ ప్రకటించారు. ఈ బిల్లును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టుగా ఆయన లోక్‌సభలో ప్రకటించారు.
తమ పార్టీ ఎంపీలతో కలిసి బందోపాధ్యాయ లోక్‌సభ నుండి వాకౌట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుపై పలు పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మనీష్ తివారీ ప్రకటించారు.