అందరూ మనుషులే ఓటేశారు.. దెయ్యాలు కాదు.. ఈసీ ఫైర్

ఆదివారం, 2 జూన్ 2019 (13:28 IST)
ఈ ఎన్నికల్లో అందరూ మనుషులే ఓటేశారని... దెయ్యాలు కాదని ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. పోలైన ఓట్లకు, అసలు ఓట్లకు పొంతన కుదరడం లేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాగా, అప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
పోలైన ఓట్లకు, అసలు ఓట్లకు పొంతన లేదని.. తేడా వచ్చిన ఓట్లను ఘోస్ట్ ఓట్స్‌గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఇటువంటి తేడా ఏకంగా 373 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనిపించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఈ కథనాలపై ఈసీ స్పందించింది.  
 
పోలింగ్ సమయంలో వెబ్‌సైట్‌లో పెట్టిన ఓటింగ్ శాతం తాత్కాలిక సమాచారమని, అది ఆ తర్వాత మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. త్వరలోనే పోలైన ఓట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. కాబట్టి లెక్కలో తేడా వచ్చిన ఓట్లను ఘోస్ట్ ఓట్లని, వారిని ఘోస్ట్ ఓటర్లని పేర్కొనడం వారిని అవమానించినట్లవుతుందని ఈసీ ఫైర్ అయ్యింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు