వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయభేరీ మోగించారు. అయితే, ఈ యేడాది ఆరంభంలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ పార్టీ ఏకంగా రూ.150 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు ప్రచారం సాగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ పుదుచ్చేరితో కలిపి ప్రచారం కోసం రూ.57.33 కోట్లు ఖర్చు వ్యయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ల్లో ఎన్నికల్లో రూ.84.93 కోట్లు వెచ్చించింది.
నాలుగు రాష్ట్రాలు, యూటీలో సీపీఐ కనీసం రూ.13.19కోట్లు ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు కాగా.. డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రాంతీయ పార్టీలు. అయితే, బీజేపీకి సంబంధించిన ఖర్చుల వివరాలు అందుబాటులో లేవు.