8న సంపూర్ణ సూర్య గ్రహణం.. భారత్‌లో మాత్రం కనిపించదట.. ఎందుకని?

ఠాగూర్

శనివారం, 6 ఏప్రియల్ 2024 (16:28 IST)
ఈ నెల 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. అయితే, ఈ సూర్యగ్రణం భారత్‌లో మాత్రం కనిపించదు. మెక్సికో, అమెరికా, కెనడా వంటి దేశాల మీదుగా నార్త్ అమెరికా మీదుగా ప్రయాణం చేస్తూ సంపూర్ణంగా కనిపించనుంది. కొన్ని కరేబియన్ దేశాలు, మెక్సికో, స్పెయిన్, వెనెజులా, కొలంబియా, బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్‌ల్యాండ్ దేశాల్లో పాక్షికంగా ఈ గ్రహణం దర్శనమివ్వనుంది. 
 
అయితే, నాసా లెక్కల ప్రకారం మెక్సికోలో ముందుగా గ్రహణం 11.07 (పీటీడీ కాలమానం) గంటలకు కనిపిస్తుంది. ఆ తర్వాత మైన్ వద్ద 01.30 (పీటీ)కి ముగుస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ ‌టైం (ఐఎస్డీ) ప్రకారం ఇండియాలో ఈ నెల 8వ తేదీ రాత్రి 9.12 మొదలై అర్థరాత్రి దాటాక 02.22 గంటలకు ముగుస్తుంది. అందుల్ల భారత్‌తో సహా ఆసియా ఖండాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, నాసాతో పాటు టెక్సాస్‍‌లోని మెక్ డొనాల్డ్ అబ్జర్వేటరీ సూర్యగ్రహణం ఈ సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. 
 
గ్రహణ సమయంలో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని.. అప్పుడు ఫుడ్ తింటే కల్తీ అవుతుందని పబ్లిక్ నమ్ముతున్నారు. కానీ గ్రహణ సమయంలో కొంత ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని స్టడీస్ చెబుతున్నాయి. చాలా మంది గ్రహణం విడిచాక మిగిలిన ఆహారాన్ని పడేస్తారు. నాసా చెప్పే దాని ప్రకారం గ్రహణం వేళ ఏర్పడే రేడియేషన్ ఆహారంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే, దీన్ని అనేక మంది శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు