*ఏఎస్ఐ టూరిస్టు స్పాట్లు
దేశ వ్యాప్తంగా 3,691 ప్రాచీన కట్టడాలు, పర్యాటక కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం మార్చి 17 నుంచి వీటన్నిటినీ మూసేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో ఈ పర్యాటక కేంద్రాలను మళ్లీ తెరిచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో హైదరాబాద్‌లోని చార్మినార్, గోల్కొండ, సెవన్ టూంబ్స్, సాలార్జంగ్ మ్యూజియం లాంటి టూరిస్టు ప్లేసులు ఉన్నాయి. అలాగే కర్ణాటకలోని టిప్పు సుల్తాన్ కోట, చిత్రదుర్గ కోట, ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని కుతుబ్‌మినార్, ఎర్రకోట లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఏఎస్ఐ పర్యవేక్షణలో ఉన్నాయి.