హిజ్రాలపై పోలీసుల లాఠీఛార్జ్.. వీడియో వైరల్

మంగళవారం, 11 జూన్ 2019 (14:58 IST)
ఉత్తరప్రదేశ్, మీరట్‌కు సమీపంలోనిలాల్ గుర్తి పోలీస్ స్టేషన్‌లో హిజ్రాలపై లాఠీఛార్జ్ జరిగింది. హిజ్రాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేశారు.


దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘర్షణకు కారణమైనా అరెస్ట్ చేయాల్సిందిపోయి.. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
హిజ్రాలకు మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 
 
పోలీస్ స్టేషన్‌లోనూ హిజ్రాల గ్రూపుల మధ్య గొడవలు ఆగలేదు. ఏమాత్రం నచ్చజెప్పినా హిజ్రాలు తగ్గకపోవడంతో ఇక లాభం లేదనుకున్న పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

అయితే హిజ్రాలపై లాఠీ ఛార్జ్‌లపై ఉన్నతాధికారులకు యూపీ పోలీసులు వివరణ ఇచ్చారని.. గొడవను సద్దుమణిగేలా చేసేందుకే లాఠీఛార్జ్ చేశామన్నారు.

#WATCH: Transgenders lathi charged by police allegedly after they created ruckus in Lalkurti police station,Meerut today. SSP says,'things have come to the fore,transgenders misbehaved,but force was used to control them. If force used was more than required,probe to be conducted' pic.twitter.com/3Fq4gl8EoX

— ANI UP (@ANINewsUP) June 10, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు