పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి.. ఎక్కడంటే..?

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (13:28 IST)
పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లోగల మర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్నామర్ద్ గ్రామంలో కవలలు మృతి చెందారు. ఈ బాలికల మృతి స్థానికంగా సంచలనం రేపింది. వారి మృతికి కారణం తెలియగానే అక్కడున్నవారంతా హతాశులైపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. కవలలు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఏడుస్తుండగా, తండ్రి వారిద్దరికీ గ్లాసుతో పాలు పట్టించాడు. పాలు తాగిన కొద్దిసేపటికే ఆ చిన్నారులిద్దరి నోటి నుంచి నురగలు రాసాగాయి. విషయం తెలియగానే చుట్టుపక్కల వారంతా బాధిత చిన్నారుల ఇంటికి వచ్చారు. వారంతా ఇంటిలోని నలుమూలలా చూడగా, ఒక పాము కప్పను మింగుతూ కనిపించింది. 
 
దీంతో ఆ పాము పాలను తాగి ఉంటుందని, ఆ పాలనే చిన్నారులు తాగి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వారు ఆ బాలికలను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు