కిలోమీటరు విస్తీర్ణంతో కూడిన గ్రహశకలాలు.. భూమివైపు దూసుకొస్తున్నాయ్...

మంగళవారం, 13 జూన్ 2023 (10:14 IST)
కిలోమీటరు విస్తీర్ణంతో కూడిన గ్రహశకలాలు భూమివైపు అత్యంత వేగంగా దూసుకొస్తున్నాయి. వీటిని అత్యంత ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఈ గ్రహ శకలం ఈ నెల 15వ తేదీన భూమిని తాకొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని వారు తెలిపారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న క్రమంలో ఇవి భూమికి సమీపానికి రాబోతున్నాయి. వీటి చుట్టు కొలత 500 నుంచి 850 మీటర్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సౌరవ్యవస్థ ఏర్పడిన క్రమంలో రాతి శకలాలు ఇలా వేరుపడి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. వీటిని గ్రహ శకలాలు అని పిలుస్తారు. 
 
ఈ గ్రహ శకలాన్ని2020 డీబీ5గా నామకరణం చేశారు. ఇదులో 1994 ఎక్స్ డీ సోమవారం అంటే ఈ నెల 12వ తేదీనే భూమికి సమీపంలో వచ్చినట్టు తెపారు. ఇది చివరగా 2012 నవంబర్ 27వ తేదీన భూమికి చేరువగా వచ్చి వెళ్లింది. తిరిగి 2030లో భూమికి చేరువగా రానుంది. 
 
2020 డీబీ5 గ్రహ శకలం ఈ నెల 15వ తేదీన భూమికి 4308418 కిలోమీటర్ల సమీపంలో రానుంది. గంటకు 34272 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది చివరగా 1995లో ఇలా భూమికి దగ్గరగా వచ్చి వెళ్లింది. ఈ రెండింటి వ్యాసార్థం 150 మీటర్లకు మించి ఉన్నందున వీటిని ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. వీటి గమనంపై నాసా ఓ కన్నేసి ఉంచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు