Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

సెల్వి

మంగళవారం, 25 మార్చి 2025 (09:55 IST)
భువనేశ్వర్, గజపతి జిల్లాలో స్థానిక అంగన్‌వాడీ కేంద్రం తక్కువ బరువున్న పిల్లల కోసం సరఫరా చేసిన ప్రత్యేక 'సత్తు' అనే పిండిని తిని ఇద్దరు సోదరీమణులు అనుమానాస్పదంగా మరణించారు. ఈ సంఘటన ఆదివారం ఆర్ ఉదయగిరి బ్లాక్‌లోని రామగిరి గ్రామంలోని తులసి నగర్‌లో జరిగింది. 
 
మృతులిద్దరూ ఆరు, మూడు సంవత్సరాల వయసు గలవారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అక్క చనిపోగా, చెల్లెలు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిందని అధికారులు తెలిపారు. మరో సోదరి, వారి తండ్రి పరిస్థితి విషమంగా ఉందని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యులు తెలిపారు. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.
 
ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాం. గ్రామంలోని ఇతర కుటుంబాలు కూడా అదే ప్రత్యేక 'సత్తు'ను పొందినప్పటికీ, వారి నుండి ఎటువంటి ఫిర్యాదు రాలేదు. "అనారోగ్యంతో ఉన్న తండ్రి, కుమార్తెలకు సరైన చికిత్స అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది" అని జిల్లా కలెక్టర్ బిజయ్ కుమార్ దాష్ అన్నారు. 
 
మృతురాలి ఇంటి నుండి 'సత్తు' సంచిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు 'సత్తు' పంపిణీ చేయవద్దని అంగన్‌వాడీ కార్యకర్తలను కోరినట్లు వారు తెలిపారు. మృతురాళ్లను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఆశా కార్యకర్త మాట్లాడుతూ, వారు కడుపు నొప్పి, వాంతులు చేసుకున్నారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు