విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

ఠాగూర్

సోమవారం, 24 మార్చి 2025 (19:21 IST)
ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలుదేరిన విమానం సోమవారం జుబ్బల్‌హట్టి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానం ఉదయం 8.20 గంటలకు సిమ్లా జుబ్బల్‌హట్టికి చేరుకోగా పైలట్ ల్యాండింగ్ కోసం అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత విమానంలో ప్రయాణికులు దాదాపు 30 నిమిషాల పాటు విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి సిమ్లా తిరిగి వస్తున్నారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర డీజీపీ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. సోమవారం ఉదయం సిమ్లా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఢిల్లీ నుండి సిమ్లా వెళుతున్న ఆలయెన్స్ ఎయిర్ విమానం నంబర్ 91821 బ్రేకులతో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం.
 
సిమ్లాలోని జుబ్బర్‌హట్టి విమానాశ్రయ పరిపాలన అత్యవసర ల్యాండింగ్ సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలుదేరిన అలయన్స్ ఎయిర్ విమానం నంబర్ 91821 సోమవారం ఉదయం సిమ్లా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ల్యాండింగ్ సమయంలో, రన్‌వే పై విమానం బ్రేకులలో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలెట్ వెంటన్ ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కి తెలియజేసి, అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది. పైలెట్ ఈ విషయం గురించి ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి, వారి సీట్లు గట్టిగా పట్టుకోమని కోరాడు. దీని తర్వాత పైలెట్ అత్యవసర బ్రేకులను ఉపయోగించి విమానాన్ని సగం రన్‌వే పై ఆపినట్టు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు