కరోనా మహమ్మారి కారణంగా కొత్త విద్యా సంవత్సరాన్ని ఎప్పటిలా జూలై నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతిపాదనలు చేసింది. కరోనా కారణంగా మార్చి నెల నుంచే కాలేజీలు, సూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్19 నేపథ్యంలో కాలేజీల అంశాన్ని స్టడీ చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను వేసింది.
ఒకవేళ వర్సిటీల్లో కావాల్సినంత మౌళిక సదుపాయాలు ఉంటే, వారు ఆన్‌లైన్ పరీక్షలు చేపట్టవచ్చు అని మరో కమిటీ సూచించింది. మానవవనరుల మంత్రిత్వశాఖ ఆ రెండు కమిటీ నివేదికలను పరిశీలిస్తున్నది. మరో వారం రోజుల్లోగా దీనిపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తుందని తెలుస్తోంది.