దేశవ్యాప్తంగా 23 నకిలీ యూనివర్శిటీలు... అవేంటో తెలుసా?
బుధవారం, 24 జులై 2019 (15:07 IST)
దేశవ్యాప్తంగా నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) తాజాగా విడుదల చేసింది. సాధారణంగా దేశంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం 1956లోని సెక్షన్ 22(1) ప్రకారమే ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదా, యూజీసీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీ లేదా పార్లమెంట్‌లోని చట్టం ప్రకారం మాత్రమే విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఈ యూనివర్శిటీలు ఇచ్చే డిగ్రీలు మాత్రమే చెల్లుబాటవుతాయి.
అయితే, ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా కుప్పలుతెప్పలుగా అనేక విశ్వవిద్యాలయాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలియక అనేక మంది విద్యార్థులు మోసపోతున్నారు. నకిలీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు తీసుకొని విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకుంటున్నారు. అందుకే నకిలీ విశ్వవిద్యాలయాలను ఏరిపారేసేందుకు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా, దేశ వ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్టు వెల్లడించింది.
ఈ మొత్తం విశ్వవిద్యాలయాల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎనిమిది, ఢిల్లీలో 7, వెస్ట్ బెంగాల్‍లో 2, ఒడిషాలో 2, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, పుదుచ్చెరీలో ఒక్కొక్కటి చొప్పున నకిలీ యూనివర్శిటీలు ఉన్నట్టు వెల్లడించింది. ఆ నకిలీ యూనివర్శిటీల జాబితా ఇదే..
1. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దార్యాగంజ్, ఢిల్లీ.