మరోవైపు, ఉగ్రవాదులకు సహకరిస్తున్నవారిని, అనుమానితులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 900 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పౌరులపై ఉగ్రదాడుల తర్వాత 13 మంది ముష్కరులను వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో హతమార్చారు.
జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులపై ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో నలుగురిని హత్యచేశారు. శనివారం బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వీధి వ్యాపారి, కార్పెంటర్‌ను హత్యచేసిన ఉగ్రవాదులు.. ఆదివారం బిహార్‌కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు.