జైట్లీ నోట గాంధీ మాట.. నిర్ణయం సరైనదైతే.. అది ఎన్నటికీ విఫలం కాదు.. బడ్జెట్ హైలైట్స్
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:58 IST)
కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీని జైట్లీ స్మరించుకున్నారు. నిర్ణయం సరైనదైతే... అది ఎన్నటికీ విఫలం కాదంటూ గాంధీ ఉద్బోధను జైట్లీ గుర్తుచేశారు. గాంధీ కలలుగన్నట్టు అవినీతి లేని, పారదర్శక పాలన కోసం తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఎస్పీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకుంటామన్నారు. నల్లధనం నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజల ధనానికి తాము రక్షకులుగా ఉంటామని వెల్లడించారు.
ఇక పెద్దనోట్ల రద్దుతో ఆదాయపన్ను చెల్లించే వారి దొంగచాటు తనం ఏంటో అర్థమైందని జైట్లీ అన్నారు. ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య తక్కువగా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వాస్తవ దృశ్యం బయటకు వచ్చిందన్నారు. జీడీపీలో పన్నులశాతం తక్కువగా ఉంది. ప్రత్యక్ష పన్నుల ద్వారా 1.74లక్షల కోట్లే వస్తోందని వెల్లడించారు.
ఇకపోతే.. రక్షణ రంగ కేటాయింపులు రూ.2.74లక్షల కోట్లని, మొత్తం బడ్జెట్ రూ.21లక్షల 47వేల కోట్లని జైట్లీ తెలిపారు. ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనం. దీనికోసం కొత్తచట్టం రూపొందిస్తామని జైట్లీ చెప్పుకొచ్చారు.
2017-బడ్జెట్ హైలైట్స్
* 20లక్షల ఆధార్ ఆధారిత స్వైపింగ్ యంత్రాలు
* పోస్టాఫీసు ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేషన్ల స్వీకరణ.
* డిజిటల్ లావాదేవీల రూపకల్పన ఆధారత్‌తో కూడా చెల్లింపులకు అవకాశం
* వ్యక్తిగత వినియోగదారులకు, వ్యాపారస్థులకు కొత్తగా మరో రెండు పథకాలు.
* 250 ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు. ఎలక్ట్రానిక్ ఉత్పాదక కేంద్రాల కోసం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు