కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనంజా

శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:32 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు దీపావళి బొనంజా ప్రకటించింది. ఇందులోభాగంగా, 15 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 4 శాతం డీఏ పెంచగా, తాజాగా మరో 15 శాతం మేరకు పెంచింది. ఈ పెంచిన డీఏను కూడా జూలై నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రటించింది. 
 
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా 15 శాతం డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే మరోమారు డబుల్ డిజిట్‌తో కూడిన డీఏను పెంచుతూ కేంద్రం ప్రకటించడంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఖుషీలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు