ఢిల్లీలో సింగపూర్ ఎయిర్‌‍లైన్స్ పైలట్ అరెస్టు... ఎందుకో తెలుసా?

వరుణ్

శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (14:46 IST)
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్‌ను పారామిలిటరీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత ఆయన అరెస్టు చేసి విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పని చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అరెస్టు చేసిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంగీత్‌గా గుర్తించారు. 
 
ఢిల్లీలోని మెట్రో స్కైవాక్ ప్రాంతంలో సంగీత్ సింగ్ సింగపూర్ పైలట్ యూనిఫాం ధరించి నడుచుకుంటూ వెళుతున్నాడు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్ అని చెప్పుకునేందుకు వీలుగా మెడలో గుర్తింపు కార్డును కూడా ధరించాడు. అయితే, అతని ప్రవర్తనను గమనించిన సీఐఎస్ఎఫ్ బలగాలు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అతని గురించి షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. 
 
అతను ఐడీ కార్డుతో సహా అంతా బోగస్ అని తేలింది. ఆన్‌‍లైన్ యాప్ బిజినెస్ కార్డు మేకర్ ద్వారా సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఐడీని తయారు చేసుకున్నాడని, ఆ తర్వాత ద్వారకలో యూనిఫాం కొనుగోలు చేసినట్టు తేలింది. ఈయన గత 2020లో ముంబైలో యేడాది ఏవియేషన్ హాస్పిటాలిటీ కోర్సు చేశాడని, తాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలెట్ కుటుంబాన్ని, స్నేహితులను నమ్మించాడని పోలీసులు తెలిపారు. సింగ్‌‍ను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు