'ట్రిపుల్ తలాక్' అనే పదానికి ముస్లిం సంప్రదాయంలో అత్యంత విలువైన పదంగా ఉంది. అలాంటి పదం ఇపుడు ఎవరు పడితే వారు వాడేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన భర్తలు.. ప్రతి చిన్న విషయానికి తలాక్ చెపుతూ తమ భార్యలకు విడాకులు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ భర్త.. చిప్స్ ప్యాకెట్ కోసం తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
యూపీలోని కవినగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ముస్లిం మహిళ ఆదివారం రాష్ట్రమంత్రి అతుల్ గార్గ్ వద్దకు వచ్చి ఈ విషయమై ఫిర్యాదు చేసింది. తమ ఇంటిపక్కనే తన తల్లిదండ్రులు ఉంటారని, ఇటీవల తన భర్త రెండు చిప్స్ ప్యాకెట్లను ఇంటికి తీసుకురాగా.. అందులో ఒక ప్యాకెట్‌ను వారికి ఇచ్చానని తెలిపింది. ఆ చిప్స్ ప్యాకెట్ గురించి గొడవపడి తనను కొట్టడంతోపాటు ట్రిపుల్ తలాక్ చెప్పి.. ఇంటి నుంచి గెంటేశాడని చెప్పింది. ఈ విషయమై తనకు న్యాయం జరిపించాల్సిందిగా మంత్రిని ప్రాధేయపడింది.