మనిషికి పంది మూత్రపిండం అమర్చిన వైద్యులు... ఎక్కడ?

ఠాగూర్

శుక్రవారం, 22 మార్చి 2024 (10:08 IST)
ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. జంతువుల అంతర్గత అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. మానవుల ప్రాణాలను రక్షించే క్రమంలో ఇలాంటి కొత్తకొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల పందె గుండెను ఓ మానవుడికి అమర్చారు. ఇపుడు పందె మూత్ర పిండాన్ని మనిషికి అమర్చారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని 62 యేళ్ళ ఓ రోగికి అమర్చారు. జీవించివున్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్ ఆస్పత్రి వైద్యులు గురువారం తెలిపారు. 
 
ఈ నెలలో సంబంధిత ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో పంది మూత్రపిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని వారు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు