ప్రతిఘటించిందనీ పదో అంతస్తు నుంచి తోసేశారు.. ఎక్కడ?

ఆదివారం, 25 అక్టోబరు 2020 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మనూ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు యువకులు బలాత్కారం చేసేందుకు యత్నించారు. కానీ, ఆ కామాంధు చెర నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ముగ్గురు కిరాతకులు.. ఆ యువతిని పదో అంతస్తు నుంచి కిందికి తోసేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మనూ జిల్లాలో ఓ 15 ఏళ్ల యువ‌తి శుక్ర‌వారం రాత్రి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా.. స్థానికంగా ఉండే ముగ్గురు యువ‌కులు ఆమెను అడ్డ‌గించారు. బ‌ల‌వంతంగా ఓ భ‌వ‌నంలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించారు. 
 
యువ‌తి ప్ర‌తిఘ‌టించ‌డంతో.. కోపంతో యువ‌కులు ఆమెను మూడో అంత‌స్తు నుంచి కింద‌కు తోసేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఇపుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశార‌ని, దాంతో ప్ర‌తిఘటించ‌డంతోనే కింద‌కు తోసేశారు. త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని బాధితురాలు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు