ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ దళిత బాలుడిని చితకబాదిన కొందరు వ్యక్తులు ఆ తర్వాత తమ కాళ్లు నాకించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ వీడియో వైరల్ కావడంతో నిందితులు ప్లేటు మార్చారు. ఆ బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్టు ఆరోపిస్తున్నారు. వాళ్లు కొట్టే దెబ్బలు తాళలేక వారు చేసిన ఆరోపణలను ఆ బాలుడు అంగీకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన యూపీ పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు.