ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. జనవరి 23న ప్రవాస భారతీయులు రానున్నారు. వీరు జనవరి 24న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీని ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
24న ప్రవాస భారతీయులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తర్వాత స్థానిక పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేళాకు హాజరయ్యే సన్యాసులు, భక్తులు మొదలైనవారి వివరాలు నమోదు చేసేందుకు అధికారులు రిజిస్టర్లు సిద్ధం చేశారు.