వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత గ్రామంలో డీజే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో అధికారులు పాల్గొన్నారు. పీకలవరకు మద్యం సేవించారు. వేదికపై అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశారు. ముద్దులు పెట్టారు. కౌగిలించుకున్నారు. అలా మజా చేసిన అధికారులు చివరకు జిల్లా కలెక్టర్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగాపూర్ గ్రామంలో జరిగింది. యూపీ ప్రభుత్వ ఉద్యోగులైన కౌశిక్, ముఖేష్ కుమార్‌లు ఇద్దరు గంగాపూర్ గ్రామంలో పీకల దాకా తాగి అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మాయిలకు ముద్దులు పెడుతూ.. నృత్యం చేశారు. మందు మత్తులో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన నిర్వాకంపై తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.