భర్తను ట్రక్కులో తాళ్ళతో కట్టేసి... భార్యపై 8 మంది గ్యాంగ్ రేప్... ఎక్కడ?

సోమవారం, 8 మే 2017 (10:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇది భర్తను తాళ్ళతో కట్టేసి... ఆయన ఎదుటే భార్యపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కూడా నిర్భయ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తుదితీర్పును వెలువరించిన రోజే జరగడం గమనార్హం. అదీకూడా అచ్చం నిర్భయం ఘటన తరహాలోనే జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన సాంస్కృతిక కళాకారులైన దంపతుల జంట యూపీలోని ఆరయకు వచ్చారు. అప్పటికే అర్థరాత్రి కావడంతో అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం కోసం బస్సు కోసం వేచి చూస్తుండగా, అటుగా వచ్చిన ట్రక్‌ డ్రైవర్‌ ఎటువెళ్లాలని అడిగాడు. దీంతో వారు తాము వెళ్లాల్సిన ఊరు గురించి చెప్పగా, అప్పటికే ఆలస్యమైందని, బస్సులు ఉండవని చెప్పి, తాను కూడా అటే వెళ్తున్నానని వారిని మభ్యపెట్టి తనతో రమ్మన్నాడు.
 
వారు ట్రక్ ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్లాక... ట్రక్‌ను ఒక మద్యం దుకాణం దగ్గర ఆపాడు. అక్కడ మద్యం తాగిన ట్రక్‌ డ్రైవర్‌.. మరో ఏడుగురితో కలిసి వచ్చి, భర్తను తాళ్ళతో కట్టేసి ట్రక్కులో పడేశాడు. ఆ తర్వాత కదులుతున్న ట్రక్‌‌లోనే ఆయన చూస్తుండగా... 8 మంది అతని భార్యపై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం వారి వద్దనున్న బంగారం, డబ్బు దోచుకుని, గుర్తుతెలియని ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత ఎలాగోలా అరయ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆ దంపతులు అక్కడ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి