తమ బాత్‌రూమ్‌లో ఈ పాములు కనిపించాయని స్థానికులు తెలిపారు.
ఈ విషయం నాగావ్‌లోని సబ్ డివిజన్ పట్టణమైన కలియాబోర్‌లో చోటుచేసుకుంది. అస్సాం - నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు.
'సర్పమ్ మ్యాన్'గా పిలవబడే స్నేక్ రక్షకుడు సంజీబ్ దేకా పొదిగిన పిల్లలను ఇంటి నుండి సురక్షితంగా బయటకు తీశాడు. అంతకుముందు, అతను కలియాబోలోని టీ ఎస్టేట్ నుండి 55 కిలోల కంటే ఎక్కువ బరువున్న 14 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువను రక్షించాడు.