వ్యక్తిగత సెక్యూరిటీగార్డును కొట్టిన మధ్యప్రదేశ్ సీఎం (వీడియో)

బుధవారం, 17 జనవరి 2018 (11:40 IST)
బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
దార్ జిల్లాలోని సర్దార్‌నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం సీఎం చౌహాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సెక్యూరిటి గార్డుపై చేయి చేసుకున్నాడు. 
 
కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అధికార దాహాంతో సీఎం తన సెక్యూర్టీపైనే దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన విషయంలో సీఎంను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 
 
మరోవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత వరకు స్పందించలేదు. సెక్యూర్టీ గార్డును కొట్టినందుకు, అతని విధులను అడ్డుకున్నందుకు చౌహాన్‌ను ఐపీసీ 353 కింద బుక్ చేయాలని ప్రతిపక్ష నేత అజయ్ సింగ్ డిమాండ్ ఛేశారు. 

 

Madhya Pradesh: Congress wants CM Shivraj Singh Chouhan booked for ‘slapping’ securitymanhttps://t.co/2ON5jAWxhu pic.twitter.com/ytHtNfg0tl

— The Indian Express (@IndianExpress) January 17, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు