సోషల్ మీడియాలో సెల్ఫీలు, వీడియోలు అప్ చేయడం ప్రస్తుతం ట్రెండ్. తాజాగా టీవీలో వచ్చిన ఓ ప్రోగ్రామ్‌లో కనిపించిన ఓ స్టంట్ కాపీ చేయబోయిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది.
ఆ వీడియోలో కొంతమంది యువకులు వెల్‌కమ్ టూ ఖత్రోం కా ఖిలాడీ, అని అరుస్తుండటం.. మరికొందరు ఏమో "రాజా గో ఫాస్ట్" అంటూ యువకులను ఉత్సాహపరిచారు. అయితే, ఇక్కడే కథ అడ్డం తిరిగింది.