నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

ఠాగూర్

శుక్రవారం, 6 జూన్ 2025 (16:52 IST)
సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటిని ప్రయాణికులు బుక్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే, ఓ యువతి కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్‌ను బుక్ చేసుకుంది. ఇంత తక్కువ దూరానికి ఓలా బైక్ ఎందుకు బుక్ చేసుకున్నారని రైడర్ అడిగితే.. అతనికి దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. 
 
దూరం తక్కువేగానీ, కుక్కలే ఎక్కువ. అందుకే రైడ్ బుక్ చేసుకున్నా అంటూ ఆ యువతి సమాధానమిచ్చింది. దీంతో ఆ రైడర్ అవాక్కయ్యాడు. పైగా, బైక్ చేసుకున్నందుకు ఆ యువతిని ఎక్కించుకుని గమ్యస్థానానికి చేర్చాడు. పైగా, 180 మీటర్ల దూరానికి అయిన రూ.19 బిల్లును ఆ యువతి చెల్లించి వడివడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 

 

నిమిషంలో వెళ్లే దూరానికి...ఓలా బైక్ బుక్ చేసుకున్న యువతి

ఉత్తరప్రదేశ్ లక్నోలో 180 మీటర్ల దూరానికే ఓలా బైక్ బుక్ చేసుకున్న యువతి

ఇంత తక్కువ దూరానికే ఎందుకు బుక్ చేసుకున్నారని రైడర్ అడిగితే దిమ్మదిరిగే జవాబిచ్చిన టీనేజర్

దూరం తక్కువే కానీ కుక్కలే ఎక్కువ. అందుకే రైడ్ బుక్… pic.twitter.com/Hk3p7LkSu5

— Telugu Galaxy (@Telugu_Galaxy) June 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు