ఆవులు, ఎద్దుల్ని తాము హింసించమని.. ఎంతగానో ప్రేమిస్తామని.. కన్నబిడ్డల్లా చూసుకుంటామని.. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళనాట ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. సోషల్ మీడియా కూడా జల్లికట్టుకు మద్దతుగా నిలిచింది. ఆవుల్ని.. ఎద్దుల్ని తాము ఎంతగానో ప్రేమిస్తామని తమిళ ప్రజలు పెటా లాంటి జంతు హక్కుల సంఘాలను అడుగుతున్నారు.
ఆవులు, ఎద్దులను తాము ఎంత ప్రేమగా చూసుకుంటామో అనే విషయాన్ని రుజువు చెయ్యడానికి తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. తాను చిన్నతనంలో తమ ఇంట్లో ఉండే పశువులన్నింటినీ పేర్లు పెట్టి పిలవడం తనకు ఇంకా గుర్తుందని, అలనాటి నటుడు శివాజీ మనుమడు, నటుడు విక్రమ్ ప్రభు ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియో చూస్తే తాము పశువుల పట్ల ఎలా ఉంటాము, అవి తమతో ఎలా ఉంటాయి అనే విషయం అందరికీ తెలుస్తుందని, దయచేసి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని విక్రమ్ ప్రభు ట్విట్టర్‌లో మనవి చేశారు. ఆ వీడియోలో ఒక చిన్నపిల్లాడు ఎద్దుతో ఆటలు అడుకుంటూ ఉంటాడు.
కొమ్ములు అందకపోయినా కాళ్లెత్తి మరీ దాని కొమ్ములు పట్టుకుని కిందకు వంచి ఆడుకుని, దాని చెవులు నిమురుతూ ఉన్నాడు. దానికి ఆ పిల్లాడు అటూ ఇటూ తిప్పినా కొమ్ములు తిరిగిన ఆ ఎద్దు ఆ బాలుడిని ఏమీ చెయ్యకుండా ఊరుకుంటుంది. ఆ ఎద్దు సైతం పిల్లాడితో ఆడుకుంటున్నట్లే కనిపిస్తుంది. తమిళనాడులో పశువుల పెంపకం ఒక మంచి పద్దతి అని, ఆవులు, ఎద్దులతో తాము స్నేహపూర్వకంగా ఇలాగే ఉంటామని, అందువలన జల్లికట్టు సాంప్రదాయంలో భాగంగానే చూడాలని అంటున్నారు.