మంత్రగాళ్ళనే అనుమానంతో స్థానికులు చితకబాది.. ఇద్దరు వ్యక్తులపై అమానుషంగా వ్యవహరించారు. ఇద్దరు వ్యక్తుల పళ్ళు ఊడగొట్టి.. వారి చేత చేత మలాన్ని తినిపించి, మూత్రం తాగించారు. ఈ దుర్ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా పత్రాపూర్ బ్లాక్ పరిధిలోని ఎస్బీ జగ్‌దేబ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, ఎస్బీ జగ్‌దేబ్‌పూర్ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఇటీవల మరణించారు. పిల్లల మృతికి గ్రామస్థులైన బసుదేవ్ నాయక్, బంచ్చానాయక్‌లే బొమ్మలతో చేతబడి చేశారని గ్రామస్థులకు అనుమానం వచ్చింది. అంతే ఆ ఇద్దరిని మంత్రగాళ్ళనుకున్న గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు.
మనుషులనే ఇంకితజ్ఞానం లేకుండా.. బసుదేవ్ నాయక్, బంచ్చానాయక్‌లను పట్టుకుని చితకబాదారు.. పళ్ళు ఊడగొట్టారు. ఆపై వారి చేత మనిషుల మలాన్ని బలవంతంగా తినిపించి, మూత్రాన్ని తాగించారు. ఇంత జరిగినా బసుదేవ్ నాయక్, బంచ్చానాయక్‌లు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.