గతంలో లక్నోలో ఓ వానరం లిక్కర్ షాపుకు పర్మనెంట్ కస్టమర్‌గా మారిపోయింది. చిల్డ్ బీరుపై మనసు పారేసుకున్న ఈ వానరానికి ఓ కస్టమర్ ప్రతి రోజు బీర్ బాటిల్ కొనిచ్చేవాడు. ఆ తర్వాత ఆ వానరం కాలేయం పెరిగి చనిపోయింది. లక్నో-కాన్పూరు రోడ్డులోని నవాబ్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే తరహాలో యూపీలో రాయబరేలి జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది.
మద్యానికి బానిసైన ఓ వానరం వ్యాపారులకు, వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. అది బీరు క్యాన్‌ను గటగటా తాగేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని లాక్కుంటుంది. తిరగబడితే దాడి చేస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఈ వానరాన్ని అటవీ అధికారుల సాయంతో బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
रायबरेली में बंदर का शराब पीने का वीडियो हुआ वायरल जो शराब की दुकान में आने वाले लोगो से शराब छीन लेता है और गटक जाता है। pic.twitter.com/We8qaAY4pi