అమర్తసేన్‌కు షాకిచ్చిన విశ్వభారతి యూనివర్శిటీ

గురువారం, 20 ఏప్రియల్ 2023 (14:15 IST)
పశ్చిమ బెంగాల్‌లోని శాంతి నికేతన్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని విశ్వవిద్యాలయం విశ్వభారతి యూనివర్శిటీ. ఈ యూనివర్శిటీ ప్రాంగణంలోనే నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ నివసిస్తున్నారు. ఈయన తండ్రి కూడా ఇక్కడే నివసించేవారు. మొత్తం 1.25 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఇంటిని విశ్వభారతి యూనివర్సిటీ తన తండ్రికి లీజుకు ఇచ్చింది. పక్కనే ఉన్న 5,662 చదరపు అడుగుల స్థలం కూడా అమర్త్యసేన్ వాడుకలో ఉంది. 
 
అయితే, యూనివర్శిటీ భూమి యూనివర్శిటీకి చెందిదని, అమర్త్యసేన్ దానిని ఆక్రమిస్తున్నారని యూనివర్సిటీ ఆరోపిస్తుంది. ఆక్రమిత భూమిని యూనివర్సిటీకి అప్పగించాలని కోరుతూ విశ్వభారతి యూనివర్సిటీ తరపున అమర్త్యసేన్‌కు నోటీసులు పంపించారు. అందులో 'కేంద్ర ప్రభుత్వ సలహాలు, కాగ్ నివేదిక మేరకు యూనివర్సిటీ ఆక్రమణలను తొలగించి భూమిని రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి, మీరు ఆక్రమించిన 5,662 చదరపు అడుగుల భూమిని వచ్చే నెల ఆరో తేదీలోపు ఖాళీ చేయాలి. లేనిపక్షంలో ఆ భూమిని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంటుంది' అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
తాజాగా యూనివర్శిటీ అధికారులు చేసిన ఆరోపణలను అమర్త్యసేన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 5,662 చదరపు మీటర్ల భూమిని తన తండ్రి కొనుగోలు చేశారని, తన వద్ద పత్రాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతదూరం వెళుతుందో వేచి చూడాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు