ఈ క్రమంలో ఓ షాపులోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు అనుపమ్. ఐతే.. బీజేపీ ఏం చేసింది? అసలెందుకు మీకు ఓటెయ్యాలంటూ ఆ షాపు యజమాని అనుపమ్‌ను నిలదీశాడు. అంతటితో ఆగకుండా 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి.. ఇందులో ఏ ఒక్కటైనా అమలు చేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. షాక్ తిన్న అనుపమ్.. తెల్ల ముఖం వేసుకుని.. అక్కడి నుంచి బయటపడ్డారు.