ఈ ఉప ఎన్నికలో భాగంగా 256 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదన్, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్, బీజేపీ నేత కరు నాగరాజన్‌లతో పాటు మొత్తం 59 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.28 లక్షలు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 50 మంది పోలీసులు, 15 మంది పారామిలటరీ బలగాలు, 9 మంది చొప్పున ఐఏఎస్, ఐపీఎస్, నలుగురు ఐఆర్‌ఎస్ అధికారులను పర్యవేక్షణగా నియమించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 200 సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. 75 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు విధుల్లో ఉన్నాయి. 45 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ భద్రతా సిబ్బంది కాకుండా, స్థానిక పోలీసులు కూడా పోలింగ్ భద్రతలో నిమగ్నమయ్యారు.