తాను పదే పదే ఒకే విషయాన్ని చెబుతున్నానని ఎవరూ విసుక్కోవద్దని.. తొలుత కుటుంబం, ఆ తరువాతే మరెవరి గురించైనా ఆలోచించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని, తాను అన్ని విషయాలూ చెబుతానని వెల్లడించారు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా వుందని, ప్రతి ఒక్కరికీ వాళ్ల పిల్లలే ఆస్తి అన్నారు. పిల్లలను చదివించుకోవాలని.. తల్లిదండ్రులను గౌరవించాలని ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చారు.
అంతకుముందు మంగళవారం చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధరంగంలోకి దిగితే గెలిచే తీరాలని రజనీకాంత్ అన్నారు. అందుకు జనాకర్షణ ఒక్కటే సరిపోదని, పక్కా ప్లాన్ ఉండాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఇకపోతే, రజనీకాంత్ తమిళనాడులో సొంత పార్టీయే పెడుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర పార్టీలతో పొత్తు కూడా ఉండదని సమాచారం.