హాస్టల్ వార్డెన్ ఓవరాక్షన్... విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టి... నెలసరి పరీక్షలు

శనివారం, 22 జులై 2017 (14:03 IST)
యూపీలో ఓ మహిళా హాస్టల్ వార్డెన్ ఓవరాక్షన్ చేసింది. గత ఫిబ్రవరి నెల 26వ తేదీ యూపీ ముజఫర్ నగర్లోని కస్తూరి గాంధీకి చెందిన 70 మంది విద్యార్థినుల దుస్తులను విప్పించి, వారిని నగ్నంగా నిలబెట్టి.. నెలసరి పరీక్షలు చేయించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హాస్టల్ వార్డెన్ సురేఖ తోమర్.. విద్యార్థినుల పట్ల ఓవరాక్షన్ చేసింది. 
 
హాస్టల్ బాత్రూమ్‌లో ప్యాడ్లు వేసింది ఎవరో కనుగొనేందుకు.. అక్కడ బస చేసిన 70 మందిలో ఎవరు నెలసరిలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు విద్యార్థినుల దుస్తుల విప్పేలా చేసింది. ఆపై జనానాంగాలను నెలసరి పరీక్షలు చేయించింది. 
 
ఈ అకృత్యం లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధిత విద్యార్థినులు బంధువుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. హాస్టల్ వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే హాస్టల్ వార్డెన్‌ సస్పెండ్ అయ్యింది. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి