ఢిల్లీలోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అయితే, ఈ మహిళా ప్రయాణికులను ఎక్కించుకునేందుకు బస్సు డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. బస్టాపుల్లో ప్రయాణికులు వేచివున్నప్పటికీ ప్రభుత్వం రవాణా సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు మాత్రం బస్టాపుల్లో బస్సులు ఆపడంలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఆ వెంటనే ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపడంలేదని.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.