దేశంలో వరుణదేవుడు కరుణించాలని కోరుతూ ఓ మంత్రిగారు రెండు కప్పలకు పెళ్లి చేశాడు. ఈ కప్పల పెళ్లి చూడటానికి పెద్దఎత్తున అ ప్రాంత ప్రజలు రావడం గమనార్హం. పైగా, ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించి, మంచి విందు భోజన కూడా పెట్టారు. శుక్రవారం జరిగిన ఈ కప్పల పెళ్లి వివరాలు, ఈ పెళ్లిని నిర్వహించిన మంత్రివర్యుల వివరాలను తెలుసుకుందాం.
ఇందులోభాగంగా లలితా యాదవ్ పూజరి బ్రిజనందన్ ఆధ్వర్యంలో ఓ గుడిలో రెండు కప్పలకు పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పెళ్లిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఈ పెళ్లికి బ్యాండ్ బాజాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత విందుభోజనాలు కూడా వడ్డించారు. పెద్ద పండుగలా ఈ కప్పల పెళ్లి కార్యక్రమం జరిగింది.