పరువునష్టం అంటే?

సోమవారం, 15 నవంబరు 2021 (22:34 IST)
పరువునష్టం దావా IPC 499, 500  అంటే సమాజంలో ఒక వ్యక్తి యెక్క పరువు,గౌరవ మర్యాదలకు నష్టం వాటిల్లే విధంగా మాట్లాడం లేదా లిఖిత పూర్వంగ  పేపర్, పామ్ప్లేట్ రూపంలో ప్రచురించడం లేదా సైగల రూపంలో లేదా వీడియోలలో చేసినట్టు అయితే పరువు నష్టం దావా వేయొచ్చు.

ARTICLE 21 ప్రకారం ప్రతి భారతీయునికి సమాజంలో గౌవరవంగా, మర్యాదగా జీవించే హక్కు ఉంది దాన్ని హరించే హక్కు ఎవరికి లేదు ఒక వేళ అలా చేస్తే మనం పరువునష్టం దావా వేసి నష్టపరిహారం రూపంలో డబ్బు అడగచ్చు లేదా IPC 499, 500  ప్రకారం 1 లేదా 2 సంవత్సరాల శిక్ష  లేదా జరిమానా లేదా రెండు పడే అవకాశం ఉంది.
 
మరింత క్లుప్తంగా÷
ఉదాహరణకు: ఒక రాజకీయ నాయకుడు ఎదో ఒక స్కాం చేసి సాక్ష్య ఆధారాలతో దొరికి కోర్టులో నిరూపీతం అయి శిక్ష పడింది శిక్ష అయిపోయిన తరువాత మళ్ళీ ఎలక్షన్లో నిలపపడ్డాడు అప్పుడు ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నువు లంచ గోండివి, స్కామ్స్ చేస్తావ్ ప్రజల సొమ్ము తింటావ్ అని కామెంట్ చేస్తాడు.

ఆ కామెంట్ ఆ రాజకీయ నాయకుడు చూసి తన పలుకుబడితో పోలీస్ వారితో పరువు నష్టం దావా వేసి అరెస్ట్ చేపిస్తే అప్పుడు పరువునష్టం దావా అనేది పనిచేయొదు ఎందుకు అంటే అతను మాట్లాడింది నిజం సాక్ష్యం ఆధారాలు ఉన్నాయి కాబట్టి అదే ఎ సాక్ష్యం ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే పరువు నష్టం దావా వర్తిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు