ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయి..

మంగళవారం, 13 జులై 2021 (14:16 IST)
ఉత్తరప్రదేశ్‌ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీస మద్దతు ధరకు అందించి 12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచింది. రైతులకు కనీస మద్దతు ధర కింద మొత్తం రూ .11,141.28 కోట్లు చెల్లించడం జరిగింది. 
 
2020-21 సీజన్ లో 6.64 లక్షల మంది రైతుల నుంచి 35.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించారు. వీటితో పోలిస్తే ప్రస్తుతం 58 శాతం మేర పెరిగింది. అంతేకాదు 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లోనే వరి సేకరణలోనూ సరికొత్త రికార్డు నమోదు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు