చిరుత పులులు, పెద్దపులులు, నలుపు చిరుతలు జనవాసంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, ఇండోర్‌లో చిరుత జనాలకు చుక్కలు చూపెట్టింది. జనాలపై దాడి చేసింది. ఇండోర్ ఖండ్వా రోడ్‌లోని నివాస ప్రాంతాలలోకి చిరుత ప్రవేశించింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఆపై అటవీశాఖ, జంతుప్రదర్శనశాల అధికారులను రంగంలోకి దిగారు. అటవీశాఖాధికారులు, జూ అధికారులు వలలు విసిరి విశ్వప్రయత్నాలు చేసినా చిరుతపులిని పట్టుకోలేకపోయారు. చిరుతను పట్టుకునే క్రమంలో అటవీ శాఖ సిబ్బంది కూడా గాయపడ్డారు.