సాధారణంగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు పర్వతాల పైకెళ్లి సేద తీరుతుంటారు. కానీ, ఢిల్లీ-NCRలో డిసెంబర్ నెలలో మాత్రం గడ్డు కట్టించేంత చలి పెరిగిపోయింది. 119ఏళ్లలో డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఈ స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి.
గడిచిన 100 ఏళ్లలో 4 ఏళ్లలో (1919, 1929, 1961, 1997) మాత్రమే ఉష్ణోగత్రలు ఒక్కసారిగా పడిపోయాయి. శతాబ్ద కాలంలో 1997 తర్వాత అది డిసెంబర్ నెలలోనే 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
2019 ఏడాదిలో డిసెంబర్ 26 వరకు గరిష్టంగా 19.85 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రసిద్ధ పర్వత ప్రాంతాలైన సిమ్లా, ముస్సూరీ కంటే ఢిల్లీలోనే చలి తీవ్ర స్థాయిలో నమోదువుతోంది.