భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. అయితే ప్రస్తుతం చాలామందిలో ఓపిక నశించింది. దీంతో చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న గొడవలను మరిచిపోయి.. సాఫీగా సంసారం చేసుకునే దంపతులు రోజు రోజుకీ తగ్గిపోతుంది. తాజాగా ఓ భార్య పుట్టింటి నుంచి మెట్టింటికి రమ్మని భర్త చెప్పిన పాపానికి అతడి నాలుకను కరకరా కొరికేసింది.
వివరాల్లోకి వెళితే.. యూపీలోని లఖ్‌నవూ జిల్లాకు చెందిన మున్నా, సల్మా దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే వీరికి తరచూ ఏదో గొడవ జరుగుతుండేది. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను.. ఇంటికి తీసుకొచ్చేందుకు సల్మా అత్తారింటికి వెళ్లాడు. ఇకపై గొడవపడనని చెప్పాడు. తన వెంట రావాలని కోరాడు. కానీ భార్య నిరాకరించింది. దీంతో మళ్లీ గొడవ మొదలైంది.